

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గాయాల నుంచి కోలుకునేందుకు అక్కడికి వెళ్లిన కొందరు ఆటగాళ్ల బరువు పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో చీఫ్ ఫిజియో కమలేశ్ జైన్‌ను బోర్డు వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా సీవోఈలో ఉన్న సమయంలో నాలుగు కిలోల బరువు పెరిగినట్లు వచ్చిన కథనాలు చర్చనీయాంశంగా మారాయి.
యో-యో టెస్టు స్థానంలో అమలు చేస్తున్న బ్రాంకో టెస్టుపై కూడా బీసీసీఐ సమీక్ష చేపట్టినట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో పలువురు ఆటగాళ్లు కండరాల గాయాలతో బాధపడటం, హర్షిత్ రాణాకు అధిక బరువు ఉన్నప్పటికీ క్లియరెన్స్ ఇవ్వడం వంటి అంశాలపై కమలేశ్ జైన్‌ను బోర్డు ప్రశ్నించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. హర్షిత్ రాణా బరువు 96 కిలోలలోపే ఉండాలని సూచించిన మేనేజ్‌మెంట్, భవిష్యత్తులో సీవోఈ ఫిట్‌నెస్ విధానాల్లో కీలక మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!