
జనరల్

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలు–2025ను ప్రకటించింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్లు, సంస్థలకు ఈ అవార్డులను అందించనున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా అవార్డులను ఖరారు చేశారు.

తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్, షట్లర్ గాయత్రి గోపీచంద్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణను ప్రదర్శించిన క్రీడాకారులకు అర్జున అవార్డును అందిస్తారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!