

డిఫెన్స్‌లో చేసిన తప్పిదాలతో భారత్ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. హాకీ వరల్డ్‌కప్‌లో గ్రూప్-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 2-4తో పరాజయం పాలైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ 17వ నిమిషంలో, దిల్‌ప్రీత్ సింగ్ 25వ నిమిషంలో గోల్స్ చేశారు. ఇంగ్లండ్ తరఫున బాండురక్ 14, 55వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా, రష్‌మోర్ 39వ, హెన్రీ 43వ నిమిషంలో చెరో గోల్ సాధించారు.
తొలి క్వార్టర్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచినా, రెండో క్వార్టర్‌లో భారత్ దూకుడుగా ఆడి 2-1తో ముందంజ వేసింది. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో మూడు పాయింట్లు సాధించిన భారత్‌కు రెండో రౌండ్ చేరేందుకు బుధవారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం. భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా ముందుకు వెళ్తుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!