
సినిమాలు

హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. ప్రాజెక్ట్ అవసరాల కోసం ఇప్పటివరకు 800 వరకు ప్రాపర్టీలను సేకరించినట్లు చెప్పారు. అయితే భూసేకరణ ప్రక్రియపై పలువురు కోర్టులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.
హెచ్-సిటీ ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని కర్ణన్ తెలిపారు. వన్‌వే విధానంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు వేగవంతం అవుతాయని చెప్పారు. మొదటి రోజు కావడంతో వాహనదారులకు కొంత ఇబ్బంది కలగవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!