

భారత సంతతికి చెందిన చెస్ క్రీడాకారిణి బోధన శివానందన్ చరిత్ర సృష్టించింది. కేవలం 11 ఏళ్ల వయసులోనే మహిళా గ్రాండ్‌మాస్టర్ (WGM) హోదా సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. లండన్‌లో పాఠశాల విద్యను అభ్యసిస్తున్న బోధన.. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లాండ్ తరఫున బరిలోకి దిగింది. మొత్తం 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి టోర్నీలో ఇంగ్లాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఇదే క్రమంలో డబ్ల్యూజీఎం హోదాకు అవసరమైన చివరి నార్మ్‌ను కూడా సాధించింది.
ఈ ఘనతతో బోధన శివానందన్ రష్యాకు చెందిన కేథరినా లాగ్నో రికార్డును అధిగమించింది. లాగ్నో 12 ఏళ్ల వయసులో మహిళా గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించగా.. బోధన 11 ఏళ్లకే ఈ ఘనత సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ చెస్‌లో బోధన అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ వేగంగా ఎదుగుతోంది. చెస్ ఒలింపియాడ్‌లో ఆమె ప్రదర్శనతో పాటు రికార్డు స్థాయిలో డబ్ల్యూజీఎం టైటిల్ సాధించడం ఆమె కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!