

ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టులో నిర్ణీత సమయంలో పాక్ జట్టు 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఈ నిర్ణయాన్ని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె ప్రకటించారు.
ఇదే సమయంలో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌కు 11 పాయింట్ల కోత విధించారు. దీంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల శాతం 4.63గా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత ఓవర్ రేట్ కంటే తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు డబ్ల్యూటీసీలో ఒక పాయింట్ కోత పడుతుంది. అలాగే ప్రతి స్లో ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానా గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం అవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!