

మహిళల ఆసియా కప్ 2026 టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నీలాక్షిక 22, విష్మి గుణరత్నె 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి 4/20తో అద్భుతంగా రాణించగా.. దీప్తి శర్మ 3/19తో సత్తా చాటింది. క్రాంతి గౌడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 68, స్మృతి మంధాన 59 పరుగులతో అర్ధ శతకాలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 బంతుల్లో 129 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రిచా ఘోష్ 17, హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, ప్రబోధ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!