

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో సంజు శాంసన్ 10 పరుగులకే ఔటవడంతో భారత తుది జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. సంజుకు అవకాశం ఇచ్చింది. అయితే అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారత్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినప్పటికీ.. రెండో టీ20లో సంజును కొనసాగించాలా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అఫ్గాన్‌పై ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు భారత విజయానికి కీలకంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకోవడంతో రెండో టీ20లో వీరిద్దరినీ తప్పించడం కష్టమే. దీంతో సంజు, వైభవ్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రెండో మ్యాచ్‌లో సంజుకు మరో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ.. మరోసారి విఫలమైతే మూడో టీ20లో వైభవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్లు రాణించారు. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. రెండో టీ20లో అతడు కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!