

2028 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న పోర్చుగల్ క్రికెట్ జట్టుకు మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఫిన్లాండ్‌లో ఆగస్టు 14 నుంచి 20 వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్ యూరప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్-సీలో ఆయన పోర్చుగల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు పోర్చుగల్ ఈ టోర్నీలో పోరాడనుంది.
పోర్చుగల్‌లోని మడైరాలో జన్మించిన హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా మడైరాలోనే జన్మించాడు. ఆస్ట్రేలియా తరఫున హెన్రిక్స్ చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ జట్టు మారేందుకు అవసరమైన మూడేళ్ల వ్యవధిని పూర్తి చేసుకున్నాడు. ఫిన్లాండ్ క్వాలిఫయర్‌లో పోర్చుగల్.. ఇజ్రాయెల్, జర్మనీ, గ్రీస్, చెక్ రిపబ్లిక్‌తో తలపడనుంది. ఈ దశలో విజేత యూరప్ రీజినల్ ఫైనల్‌కు చేరుతుంది. అక్కడి నుంచి అర్హత సాధించే జట్లు 2028 టీ20 ప్రపంచకప్ గ్లోబల్ క్వాలిఫయర్‌లో చోటు కోసం పోటీ పడతాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!