
రాజకీయాలు

హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత మూడు సీజన్లలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన హార్దిక్ సారథ్యంలో ముంబయి ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో వేలానికి ముందు జరిగే ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియలో అతడు మరో ఫ్రాంచైజీకి మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
హార్దిక్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ రేసులో లేనట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!