

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని శ్రేయస్ అయ్యర్ వెల్లడించగా, తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తెలిపాడు. ప్రస్తుతం సిరీస్‌లో 2–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, భారీ స్కోరు సాధించి సిరీస్‌లో పోటీని కొనసాగించాలని వెస్టిండీస్ భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిపై అభిమానుల దృష్టి నెలకొంది. ముఖ్యంగా సొంత మైదానంలో తిలక్ వర్మ ఎలా రాణిస్తాడన్న ఆసక్తి పెరిగింది. గతంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా 297 పరుగుల భారీ స్కోరు సాధించడంతో ఈసారి కూడా భారీ స్కోరుపై అంచనాలు ఉన్నాయి. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మను ఔట్ చేసిన రోస్టన్ ఛేజ్ భారత జట్టుకు సవాలుగా మారనున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ భారీ స్కోర్లు సాధిస్తుండగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. భారీ స్కోర్లకు పేరుగాంచిన ఉప్పల్ మైదానంలో మరో పరుగుల వర్షం కురుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!