
జనరల్

భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ నెల 17 నిలవనుంది. ఆ రోజు టీమిండియా మూడు వేర్వేరు జట్లు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడనుండటంతో అభిమానులకు దాదాపు 12 గంటల క్రికెట్ వినోదం అందనుంది. భారత్ A, సీనియర్ పురుషుల జట్టు, మహిళల జట్టు అన్నీ అదే రోజు బరిలోకి దిగనున్నాయి.
ఉదయం 10 గంటలకు భారత్ A అఫ్గానిస్థాన్ Aతో తలపడనుంది. మధ్యాహ్నం 1.30కి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని సీనియర్ జట్టు అఫ్గానిస్థాన్‌తో వన్డే ఆడుతుంది. రాత్రి 7 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో భారత జట్టు పోటీ పడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు టీమిండియా అభిమానులకు క్రికెట్ పండుగగా మారనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!