
సినిమాలు

అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం నుంచి భావోద్వేగ స్పందనలు వస్తున్నాయి. గురువారం జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె వీడియోను షేర్ చేసి తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. అనంతరం ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అతడి సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు.
రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా స్పందించాడు. ముంబయి జట్టు తరఫున తొలిసారి బ్యాటింగ్ చేసినప్పుడే అవకాశాల కోసం ఎప్పుడూ వెంటపడని ఆటగాడిగా రహానెను చూశానని పేర్కొన్నాడు. జట్టు కోసం కష్టపడే తత్వం వల్లే అవకాశాలు అతడి దగ్గరకు వచ్చాయని, ఆస్ట్రేలియాలో అతడి అత్యుత్తమ ప్రదర్శనలకు అదే కారణమని సచిన్ ప్రశంసించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!