
సినిమాలు

2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్లో నిర్వహించనున్న క్రీడాంశాలను ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు కామన్వెల్త్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి కెటీ సాడ్లిర్ వెల్లడించారు. ఈ క్రీడలకు సంబంధించి భారత ఒలింపిక్ సంఘం, ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
అహ్మదాబాద్ క్రీడలను గత కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే 60 శాతం తక్కువ వ్యయంతో నిర్వహించనున్నట్లు కెటీ సాడ్లిర్ పేర్కొన్నారు. తక్కువ వ్యయంతోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ క్రీడలను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. రానున్న నెలల్లో క్రీడల ఏర్పాట్లు మరింత వేగం పుంజుకోనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!