2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

Writer: Chandrika 11:42 AM, 2 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

హరియాణాకు చెందిన రెజ్లర్ నితేశ్ సివాచ్ 2026 ఆసియా క్రీడల్లో పురుషుల 97 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రజత పతకం సాధించి భారత రెజ్లింగ్‌లో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాడు. 1962 తర్వాత ఆసియా క్రీడల్లో గ్రీకో రోమన్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ రెజ్లర్‌గా నితేశ్ నిలిచాడు. క్వార్టర్‌ఫైనల్లో తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన అమన్‌బెర్డీ అగమమ్మెడోవ్‌ను 7-1తో, సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన గన్‌బాతర్ గాంకుయాగ్‌ను 9-0తో ఓడించి ఫైనల్‌కు చేరాడు. అయితే తుది పోరులో జపాన్‌కు చెందిన యూరి నకాజాటో చేతిలో 0-4తో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.

సోనిపట్‌ జిల్లాలోని జాగ్సీ గ్రామానికి చెందిన నితేశ్‌ చిన్ననాటి నుంచి రెజ్లర్‌ కాదు. తొలుత క్రికెట్‌ ఆడిన అతడు, ఆ తర్వాత కబడ్డీపైనా ఆసక్తి చూపించాడు. అయితే ఖర్కోదాలోని ప్రతాప్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో రెజ్లింగ్‌ వాతావరణం అతడిని ఈ క్రీడ వైపు మళ్లించింది. టీనేజ్‌లో మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. ఆ సమయంలో కుటుంబ పాల వ్యాపారంలో తండ్రికి సాయం చేస్తూ పానిపట్‌లో పాలు విక్రయించాడు. అనంతరం ఓం ప్రకాశ్‌ దహియా, సందీప్‌ శిక్షణలో మళ్లీ రెజ్లింగ్‌ను కొనసాగించాడు. 2019 ఆసియా క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2022 అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, సీనియర్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన నితేశ్‌.. ఇప్పుడు ఆసియా క్రీడల్లో చారిత్రక రజతంతో తన స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ట్యాగ్లు
నితేశ్ సివాచ్ఆసియా క్రీడలు 2026గ్రీకో రోమన్ రెజ్లింగ్భారత రెజ్లింగ్నితేశ్ సివాచ్ రజతం97 కేజీల రెజ్లింగ్హరియాణా రెజ్లర్ఆసియా క్రీడల రెజ్లింగ్భారత క్రీడలురెజ్లింగ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
షోస్

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!