

ఢిల్లీలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో ఓటమి పాలైంది. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సింధు గట్టిగా పోరాడినా నిర్ణయాత్మక గేమ్‌లో విజయం సాధించలేకపోయింది.
తొలి గేమ్‌ను 11-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని 21-15తో గెలిచింది. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు చేరింది. మూడో గేమ్‌లో వాంగ్ జీ యీ 21-17తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ మధ్యలో వాంగ్‌కు గాయంతో వైద్య సహాయం అవసరమైనప్పటికీ ఆమె పోరాటాన్ని కొనసాగించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా రౌండ్-16లో ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్ చేతిలో 19-21, 11-21తో ఓటమి చెందాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!