
సినిమాలు

ఫిఫా వరల్డ్ కప్-2026 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు వీక్షించేలా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలోని రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌ల పని వేళలను పొడిగిస్తూ అనుమతులు జారీ చేసింది. ఫుట్‌బాల్ అభిమానుల కోసం లైవ్ స్క్రీనింగ్‌లకు వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం బెంగళూరులోని ఎంపిక చేసిన రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌లు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి లభించింది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించే అభిమానులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!