

పుదుచ్చేరిలో జరుగుతున్న సౌత్‌జోన్ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ‘లక్ష్య’ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తెలంగాణకు చెందిన తోలెం శ్రీతేజ మహిళల హెప్టాథ్లాన్‌లో 4,964 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 1994లో సుమవతి నెలకొల్పిన 4,817 పాయింట్ల సౌత్‌జోన్ రికార్డును అధిగమించి 32 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
ట్రయాథ్లాన్‌లో తెలంగాణకు చెందిన వర్సా ప్రదీప్ 2,743 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. లాంగ్‌జంప్‌లో తెలంగాణకు చెందిన కంచు లవ్లీత్ 4.71 మీటర్ల దూకుడుతో స్వర్ణం గెలవడంతో పాటు జాతీయ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన మహ్మద్ కైఫ్ 10.66 సెకన్లలో రజతం సాధించగా, 200 మీటర్ల పరుగులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుద్దు శేషు 21.63 సెకన్లతో రజత పతకం గెలిచాడు. మహిళల లాంగ్‌జంప్‌లో తెలంగాణకు చెందిన శ్రీవిద్య డోరా 3.82 మీటర్ల దూకుడుతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!