

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) శుక్రవారం, సెప్టెంబర్ 18న ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక పరిపాలనా అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అండమాన్-నికోబార్ దీవుల క్రికెట్ సంఘానికి అసోసియేట్ సభ్యత్వం కల్పించడం, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)లో బీసీసీఐ ప్రతినిధిని నియమించడం ప్రధాన అజెండాలో ఉన్నాయి.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సంబంధించిన నియామకాలు కూడా ఏజీఎంలో చర్చకు రానున్నాయి. ప్రస్తుత ఛైర్మన్ అరుణ్ ధూమల్ మరోసారి అదే పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే ఖైరుల్ మజుందార్ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ ఖాతాలు, 2026-27 వార్షిక బడ్జెట్‌తో పాటు పలు కమిటీలు, పరిపాలనా నియామకాలపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!