24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

Writer: Chandrika 09:51 AM, 10 ఆగస్టు, 2026
శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

వార్మప్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. తొలి రోజు నుంచే శ్రీలంక సవాళ్లకు సమాధానం ఇస్తామని ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ చెప్పినట్లుగానే.. భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. వేలి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన యశస్వి జైస్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక దేవదత్‌ పడిక్కల్‌ సెంచరీతో ఆకట్టుకుని వన్‌డౌన్‌ స్థానానికి తాను సిద్ధమేనని చాటాడు. దాదాపు పది నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి కీలకంగా మారాడు.

అయితే తొలి టెస్టుకు ముందు భారత్‌ కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. యువ స్పిన్నర్లు మానవ్‌ సుతార్‌, సారాంశ్‌ జైన్‌ స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై మరింత ప్రభావం చూపాల్సి ఉంది. కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. పేస్‌ విభాగంలో గుర్నూర్‌ బ్రార్‌ మెరుగ్గా కనిపించగా.. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అకిబ్‌ నబీ కూడా వికెట్‌ లేకుండానే ముగించాడు. మరోవైపు వికెట్‌ కీపర్ల ఫామ్‌ కూడా ఆందోళన కలిగిస్తోంది. రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. పంత్‌ నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించడం సానుకూల అంశమే అయినా.. భారీ షాట్‌కు వెళ్లి ఔటవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ట్యాగ్లు
టీమ్‌ఇండియాభారత్‌ వర్సెస్‌ శ్రీలంకశ్రీలంక టెస్టు సిరీస్‌గౌతమ్‌ గంభీర్‌శుభ్‌మన్‌ గిల్‌యశస్వి జైస్వాల్‌రవీంద్ర జడేజాదేవదత్‌ పడిక్కల్‌రిషభ్‌ పంత్‌భారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!
టెక్నాలజీ

కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..
టెక్నాలజీ

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!