

కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల జూడో విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత జూడో చరిత్రలో తొలి కామన్వెల్త్ గోల్డ్ విజేతగా అస్మిత డే చరిత్ర సృష్టించారు. అయితే ఈ ఘన విజయానంతరం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.1.5 కోట్ల నగదు బహుమతి విషయంలో ఆమె అర్హతపై సందిగ్ధత నెలకొంది.
23 ఏళ్ల అస్మిత త్రిపురకు చెందిన అథ్లెట్ అయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ జూడో పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా యూపీ పోలీస్ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. 2024లో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన క్రీడా ప్రోత్సాహక విధానం ప్రకారం శాశ్వత నివాస ధ్రువీకరణ, రాష్ట్రం తరఫున అంతర్జాతీయ ప్రాతినిధ్యం, రాష్ట్ర గుర్తింపు పొందిన విద్యాసంస్థలో కనీసం రెండేళ్ల విద్యాభ్యాసం వంటి అర్హత ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. అస్మిత ఈ నిబంధనలకు ఎంతవరకు అర్హురాలన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతక విజేతల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ క్రీడల డైరెక్టర్ ఆర్.పీ. సింగ్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!