

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మహిళల క్రికెట్ సెమీఫైనల్లో ఆమె మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ పేరిట ఉన్న 4,758 పరుగుల రికార్డును మంధాన అధిగమించారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో మంధాన కేవలం 19 బంతుల్లోనే 37 పరుగులు సాధించారు. ఆమె ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మంధాన పరుగుల సంఖ్య 4,788కి చేరింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4,287 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికే మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డును కూడా అందుకున్న మంధాన.. తాజాగా టీ20ల్లోనూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!