

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపాడు. అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన తర్వాత మూడు వరుస మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే ఔటవడంతో కొందరు విమర్శలు చేసిన నేపథ్యంలో వైభవ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. క్రికెట్‌లో వైఫల్యాలు సహజమని, జట్టు విజయం కోసం ఎప్పుడూ 100 శాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ టీవీతో మాట్లాడిన వైభవ్, తన ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. కోచ్‌లు, సహాయక సిబ్బంది తనకు ఎంతో మార్గదర్శనం చేస్తున్నారని పేర్కొన్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం తనకు ప్రత్యేకమైనదని, నాలుగు నెలల క్రితం ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ గెలిచామని గుర్తుచేశాడు. పిచ్ పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషిస్తానని వైభవ్ తెలిపాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!