
జనరల్

మహిళల టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. నేడు రాత్రి 8 గంటలకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు జట్లు ఫైనల్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకోగా, 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను గెలవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. రెండు జట్లు సమబలంగా ఉండటంతో ఉత్కంఠభరిత పోరు జరిగే అవకాశముందని, టాస్ కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!