

భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొననున్న జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టుకు జోసెఫిన్ ఎన్‌కోమో కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించినట్లు సమాచారం. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత పర్యటనలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
టీ20 సిరీస్ అక్టోబర్ 16న ప్రారంభం కానుండగా, వన్డే సిరీస్ అక్టోబర్ 23న మొదలుకానుంది. జింబాబ్వే జట్టులో జోసెఫిన్ ఎన్‌కోమో (కెప్టెన్), బిలౌడ్ బిజా, చిపో ముగేరి తిరిపానో, కెలిస్ ద్లోవు, మిచెల్ మావుంగా, ఫ్రాన్సిస్కా చిపారే, ఒలిండర్ చారే, కుద్జాయ్ చిగోరా, న్యాషా గ్వాన్‌జురా, నొంవెలో సిబాండా, లోరిన్ ఫిరి, చియోడ్జా, మోడెస్టర్ ముపాచిక్వా, టెండాయ్ మాకుషా, షార్నే మేయర్స్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టుతో జరిగే ఈ సిరీస్ జింబాబ్వే మహిళల జట్టుకు కీలక పరీక్షగా నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!