
క్రీడలు

వన్‌ప్లస్ అమెరికా, యూరప్‌తో పాటు భారత్ మార్కెట్ నుంచి దశలవారీగా వైదొలగనున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన కథనం స్మార్ట్‌ఫోన్ రంగంలో చర్చనీయాంశమైంది. ఒప్పో చేపడుతున్న గ్లోబల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. దీంతో వన్‌ప్లస్ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
అయితే ఈ కథనాన్ని వన్‌ప్లస్ ఇండియా పూర్తిగా ఖండించింది. భారత్‌లో తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, మార్కెట్ నుంచి వైదొలగే ప్రణాళికలేవీ లేవని కంపెనీ స్పష్టం చేసింది. ధృవీకరించని ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!