

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ కీలక మార్కెట్‌గా మారడంతో అంతర్జాతీయ టెక్ కంపెనీల మధ్య ధరల పోటీ మరింత తీవ్రమైంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ తన క్లాడ్ ఏఐ సేవలకు తొలిసారిగా భారత రూపాయల్లోనే సబ్స్క్రిప్షన్ చెల్లింపులను ప్రారంభించింది. దీంతో డాలర్లలో చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా భారత వినియోగదారులకు సౌకర్యం కలిగింది. క్లాడ్ ప్రో వార్షిక ప్లాన్‌ను నెలకు ₹2,000కు అందుబాటులోకి తీసుకురాగా, ఇతర ప్లాన్లను కూడా పోటీ ధరల్లో ప్రవేశపెట్టింది. భారత్ ప్రస్తుతం ఆంథ్రోపిక్‌కు రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలవడం విశేషం.
ఇక ఓపెన్ఏఐ, గూగుల్, ఇతర ఏఐ సంస్థలు కూడా పోటీ ధరలతో తమ సేవలను విస్తరిస్తున్నాయి. చాట్‌జీపీటీ గో ప్లాన్ ₹399 నుంచి ప్రారంభమవుతుండగా, గూగుల్ జెమినై సేవలు కూడా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. డెవలపర్లు ఉపయోగించే ఏపీఐ సేవల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. భారతీయ సంస్థలు తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని అందించే ఏఐ పరిష్కారాల వైపు మొగ్గుచూపుతుండగా, చైనా ఓపెన్ సోర్స్ మోడళ్ల నుంచి పెరుగుతున్న పోటీ కూడా టెక్ దిగ్గజాలను ధరలు తగ్గించేలా చేస్తోంది. ఇదే సమయంలో ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ తమ ఇంజినీరింగ్ ప్రక్రియల్లో క్లాడ్ ఏఐని వినియోగించేందుకు ఆంథ్రోపిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!