

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్‌తో పాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి 2030 నాటికి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం, పెద్ద వినియోగ మార్కెట్ ఉండటంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లకు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత గృహోపకరణాలపై దృష్టి సారిస్తోంది.
భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు గ్రేటర్ నోయిడా, పుణే ప్లాంట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది 2026 నాటికి ప్రారంభం కానుంది. ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచడమే కాకుండా ప్రీమియం ఉత్పత్తుల తయారీ, పరిశోధనాభివృద్ధిపై కూడా ఎల్‌జీ దృష్టి పెట్టింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!