
జనరల్

ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం భారత్‌లో వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనున్నట్లు కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి ఈ మార్కెట్ 150 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దేశీయ డిమాండ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అలాగే చైనా ప్లస్ వన్ విధానం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొంది.
అయితే ప్రస్తుతం భారత్ ఈఎంఎస్ మార్కెట్‌లో కేవలం 5–6 శాతం వాటానే కలిగి ఉందని, అధిక విలువ కలిగిన డిజైన్, ఐపీ రంగాల్లో పరిమిత పాత్ర ఉందని నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో 80–95 శాతం దిగుమతులపై ఆధారపడటం వల్ల లాభాలు తగ్గుతున్నాయని హెచ్చరించింది. భవిష్యత్తులో ఆటోమోటివ్, ఏరోస్పేస్ వంటి అధునాతన రంగాలపై దృష్టి సారించాలని, ప్రభుత్వం–పరిశ్రమలు కలిసి పనిచేయాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!