

దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత పెరుగుతున్నాయి. రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఎంపిక చేసిన మోడళ్ల ధరలను ఇప్పటికే పెంచాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్సెట్ల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు, పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగి వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగడం గమనార్హం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
ఐడీసీ ఏషియా పసిఫిక్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి ప్రకారం, మెమొరీ, చిప్సెట్ల ధరల పెరుగుదల కారణంగా జూన్ నాటికి భారత్‌లో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. చిప్‌లతో పాటు ఇతర మొబైల్ విడిభాగాల ధరలు కూడా పెరుగుతుండటంతో రానున్న నెలల్లో స్మార్ట్ఫోన్ల ధరలు మరో 7–10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో కంపెనీలు ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విశ్లేషకుడు శభమ్ సింగ్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!