

ఇకపై మొబైల్‌లో లైవ్ టీవీ ఛానళ్లను చూడటానికి తప్పనిసరిగా మొబైల్ డేటా లేదా వైఫై అవసరం లేకుండా చేసే డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార భారతి సిద్ధమవుతోంది. ఈ టెక్నాలజీని కమర్షియల్‌గా అమలు చేసేందుకు అక్టోబర్‌లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేయనున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్‌తో కలిసి ప్రసార భారతి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఇప్పటికే 19కి పైగా నగరాల్లో D2M టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ఇంటర్నెట్, వైఫై లేదా సాధారణ సెల్యులార్ డేటా కనెక్షన్‌పై ఆధారపడకుండా మొబైల్ పరికరాలకు నేరుగా లైవ్ టీవీ వంటి కంటెంట్‌ను ప్రసారం చేయడం D2M టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. 470–582 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో D2M ప్రసారాలు నిర్వహించే అవకాశాలపై పరిశోధనలు జరిగాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు అనుకూలమైన హార్డ్‌వేర్, ప్రసార ప్రమాణాలకు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడం ఒక సవాలుగా ఉంది. మరోవైపు డేటా వినియోగం తగ్గితే తమ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!