

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై అదనపు భారం మోపాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఛార్జీలు అక్టోబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
దూరాన్ని బట్టి దేశీయ విమానాలపై ఫ్యూయల్ సర్‌ఛార్జీని రూ.400 నుంచి రూ.1,200 వరకు, అంతర్జాతీయ విమానాలపై 55 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు పెంచింది. ఇదిలా ఉండగా, మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా దేశీయ సర్వీసులపై ఫ్యూయల్ సర్‌ఛార్జీ విధానాన్ని తిరిగి తీసుకొచ్చింది. దేశీయ విమానాలకు దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,150 వరకు సర్‌ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ సర్వీసులపై ఇప్పటికే ఉన్న సర్‌ఛార్జీని కూడా పెంచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!