

దేశంలో ఉత్పత్తి అవుతున్న లిథియం అయాన్ బ్యాటరీల వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను తిరిగి పొందడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా లిథియం అయాన్ బ్యాటరీలను ముక్కలుగా చేసి తయారయ్యే ‘బ్లాక్ మాస్’ ఎగుమతులపై నిషేధం విధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని DGFT నవంబర్ 10న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నిర్దిష్ట రకం బ్యాటరీ వ్యర్థాలు, స్క్రాప్ ఎగుమతుల విధానాన్ని ‘ఫ్రీ’ నుంచి ‘నిషేధిత’ విభాగంలోకి మార్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.
బ్లాక్ మాస్‌లో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. వీటిని దేశంలోనే రీసైకిల్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు దేశీయ బ్యాటరీ తయారీ, ఈవీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశీయ రీసైక్లింగ్ సంస్థలకు ముడి పదార్థాల లభ్యత పెంచడం, ఈ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం కూడా ఈ నిర్ణయం లక్ష్యాలుగా ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!