

అమెరికాకు చెందిన ప్రముఖ డీప్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సంస్థ క్లౌడ్‌యాంగిల్స్ హైదరాబాద్‌లో తన గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్ (జీఈసీ)ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో జీఈసీ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, దాదాపు 1,000 మంది ఇంజినీర్లతో బలోపేతం చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
హైదరాబాద్ జీఈసీ ద్వారా డిజిటల్ టెక్నాలజీ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, డేటా అండ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కార్పొరేట్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో సేవలు అందించనుంది. ఆగస్టు 11న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ టెక్నాలజీ హబ్‌గా మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రాధాన్యత ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!