

హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసే వినియోగదారులకు ఉచితంగా సురక్షితమైన తాగునీటిని అందించడం తప్పనిసరి అని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) స్పష్టం చేసింది. ఇకపై కస్టమర్లను బాటిల్ వాటర్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదని, వారు అడగకముందే ఉచిత తాగునీటిని అందించాలని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే ఆదేశాలు జారీ చేశారు.
ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం ఉచిత తాగునీరు వినియోగదారుల ప్రాథమిక హక్కు అని ఎఫ్‌డీఏ పేర్కొంది. రెస్టారెంట్లలో ఉచిత తాగునీరు అందుబాటులో ఉందని స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మాత్రమే ఉపయోగించాలని, వార్తా పత్రికలపై ఆహార పదార్థాలు వడ్డించడాన్ని పూర్తిగా నిషేధించింది.
హోటల్ సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ శిక్షణ తప్పనిసరి చేసింది. వంట నూనెలను పదే పదే ఉపయోగించడంపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతి హోటల్, రెస్టారెంట్ తమ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను ప్రవేశ ద్వారం వద్ద ప్రదర్శించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!