

ఇరాన్ ఆర్థిక వ్యవస్థను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ‘రెసిస్టెన్స్ ఎకానమీ’ విధానాలను మరింత బలోపేతం చేయాలని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక సమస్యలకు స్వదేశీ ఉత్పత్తిని పెంచడమే ప్రధాన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల నియంత్రణ, వస్తువుల మార్కెట్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించాలని కూడా అన్నారు.
ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు అవసరమైన రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఖమేనీ సూచించారు. దేశీయ ఉత్పత్తి సరిపోని సందర్భాల్లో మాత్రమే దిగుమతులను వివేకంతో వినియోగించాలని అన్నారు. అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ను ప్రారంభించిన నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యల ద్వారా ఆర్థిక ఒత్తిడిని తట్టుకునేందుకు దేశీయ ఉత్పత్తి, పెట్టుబడులు, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అంశాలకు ఇరాన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!