

ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. కొత్త ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ సేవ కోసం రూ.70 చెల్లించాల్సి ఉండగా, ఇకపై జూలై 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా ఈ సేవను పొందవచ్చు. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది.
ఈ సేవ ప్రారంభమైన రెండు రోజుల్లోనే సుమారు 2.5 లక్షల మంది తమ ఇ-మెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఐదు నెలల్లో ఆధార్ యాప్‌ను 3.10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, 40 లక్షలకుపైగా మొబైల్ నంబర్లు, దాదాపు 10 లక్షల చిరునామాలు కూడా ఈ యాప్ ద్వారా అప్డేట్ అయ్యాయి. ఇ-మెయిల్ అప్డేట్ కోసం ముందుగా ఆధార్ యాప్‌లో లాగిన్ అయి, ఇ-మెయిల్ అప్డేట్ ఎంపికను ఎంచుకుని కొత్త ఇ-మెయిల్ నమోదు చేయాలి. అనంతరం ఓటీపీ ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!