

భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2026 నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ నివేదికను ప్రపంచవ్యాప్తంగా 34 మార్కెట్లలో 1.75 లక్షల మందికి పైగా, భారత్‌లో సుమారు 3,500 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించారు.
సర్వే ప్రకారం, భారత్‌లో 46 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగం మార్చాలని భావిస్తుండగా, 32 శాతం మంది గత ఆరు నెలల్లోనే సంస్థను మార్చారు. ఉద్యోగులు ముఖ్యంగా పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత, సమాన అవకాశాలు, కెరీర్‌లో ఎదుగుదల, ఆకర్షణీయమైన వేతనాలు, సంస్థ ప్రతిష్ఠ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది.
రాండ్‌స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్న భారత్‌లో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా టాలెంట్ వ్యూహాలను రూపొందించే సంస్థలే ఉత్తమ ప్రతిభను ఆకర్షించి నిలుపుకోగలవని అన్నారు. ఈ జాబితాలో సామ్‌సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, డెల్ టెక్నాలజీస్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!