13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్

Writer: G.Sreekanth Reddy 10:24 AM, 12 నవంబర్, 2026
ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ చుట్టూ వివాదం ముదురుతున్న వేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎలాన్.. దయచేసి జెన్సెన్‌ను నియమించుకోండి' అంటూ ఓ నెటిజన్ చేసిన సూచనకు మస్క్ స్పందించారు. 'అది నాకు గౌరవంగా ఉంటుంది' అంటూ సమాధానమిచ్చారు. దీంతో టెక్ ప్రపంచంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చైనా గూఢచారిగా భావిస్తున్న మహిళతో అఫైర్ నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అతడిని సీఈవోగా తొలగించేందుకు ఎన్విడియా బోర్డు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆలిస్ హువాంగ్ అనే చైనా వ్యాపారవేత్తతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అలాగే ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలు కింబర్లీ పావెల్‌తోనూ ఆయనకు సంబంధం ఉందంటూ మరో కథనం వెలువడింది. ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్ భవిష్యత్తుపై ఎన్విడియా బోర్డు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది.

ఇలాంటి తరుణంలో జెన్సన్‌కు మస్క్ మద్దతుగా మాట్లాడడం ఆసక్తిరంగా మారింది జెన్సెన్ హువాంగ్‌కు మస్క్ మద్దతు తెలపడం ఇదే మొదటిసారి కాదు. హువాంగ్ ఒక గొప్ప వ్యాపారవేత్త అని, అమెరికా కృత్రిమ మేధ రంగంలో ఆయన కీలకమని ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందిస్తూ.. తాను కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానన్నారు. అంతేకాదు, ఇద్దరి మధ్య చాలా కాలంగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. 2016లో ఎన్విడియా తయారు చేసిన డీజీఎక్స్-1 ఏఐ సూపర్ కంప్యూటర్‌ను తొలిసారిగా కొనుగోలు చేసింది మస్క్ సంస్థే. ఆ కంప్యూటర్‌ను జెన్సెన్ హువాంగ్ స్వయంగా మస్క్ కార్యాలయానికి తీసుకెళ్లి అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్‌విడియాలో సంచలనం.. జెన్సన్ హువాంగ్ రాజీనామాపై చర్చ!

ఎన్‌విడియాలో సంచలనం.. జెన్సన్ హువాంగ్ రాజీనామాపై చర్చ!

మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో అంతరాయం.. నిలిచిపోయిన అవుట్‌లుక్, టీమ్స్

మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో అంతరాయం.. నిలిచిపోయిన అవుట్‌లుక్, టీమ్స్

ప్రధాన నగరాల్లో తగ్గిన బంగారం ధరలు..మీ ఊరిలో ఎంతంటే?

ప్రధాన నగరాల్లో తగ్గిన బంగారం ధరలు..మీ ఊరిలో ఎంతంటే?

కృష్ణా జీవీకే హోటల్స్ లాభాల్లో వృద్ధి

కృష్ణా జీవీకే హోటల్స్ లాభాల్లో వృద్ధి

న్యూట్రిఫ్రెష్ విస్తరణలో కీలక కేంద్రంగా హైదరాబాద్

న్యూట్రిఫ్రెష్ విస్తరణలో కీలక కేంద్రంగా హైదరాబాద్

రెండేళ్ల గరిష్ఠానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

రెండేళ్ల గరిష్ఠానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

ట్యాగ్లు
టెస్లాఎలాన్ మస్క్ఎన్విడియాసీఈవోజెన్సన్ హువాంగ్చైనావివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ
జనరల్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్
జనరల్

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు
జనరల్

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ.. భారీ పెట్టుబడులకు కీలక ఒప్పందాలు

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్-కావ్యల పెళ్లి.. స్వాభిమానం పద్ధతిపై చర్చ
జనరల్

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్-కావ్యల పెళ్లి.. స్వాభిమానం పద్ధతిపై చర్చ

జువ్వలదిన్నెను మారిటైమ్ రోబోటిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేష్
జనరల్

జువ్వలదిన్నెను మారిటైమ్ రోబోటిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!