

యమహా మోటార్ ఇండియా ఆర్-సిరీస్‌లో కొత్త వైజడ్‌ఎఫ్-ఆర్2 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2,30,500గా, టాప్ వేరియంట్ వైజడ్‌ఎఫ్-ఆర్2 ఎం ధర రూ.2,53,000గా నిర్ణయించింది. బైక్ డెలివరీలు సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఈ మోడల్‌కు ప్రపంచంలోనే తొలి మార్కెట్‌గా నిలిచింది.
వైజడ్‌ఎఫ్-ఆర్2లో 204 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండగా, ఇది 26.5 బీహెచ్‌పీ శక్తిని, 19.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 149 కిలోల కెర్బ్ వెయిట్‌తో ఈ బైక్ తేలికపాటి స్పోర్ట్స్ బైక్‌గా రూపొందింది. 17 అంగుళాల వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రెండో వేరియంట్‌లో బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉండగా, టాప్ ఆర్2ఎం వేరియంట్‌లో అడ్జస్టబుల్ సస్పెన్షన్, స్మార్ట్ కీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!