

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినియోగదారులకు షాక్ తగిలింది. ప్రముఖ బ్రాండ్లు వన్‌ప్లస్, ఒప్పో తమ పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌లు, ఇతర హార్డ్‌వేర్ భాగాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పెరిగిన తయారీ వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు కంపెనీలు ధరలను సవరించినట్లు సమాచారం.
ఒప్పో తన రేనో 16 సిరీస్‌పై గరిష్టంగా రూ.5,000 వరకు ధర పెంచింది. రేనో 16 5G వేరియంట్ల ధరలు రూ.66,999, రూ.71,999కి చేరగా, రేనో 16C 5G మోడళ్లపై రూ.4,000 వరకు పెంపు నమోదైంది. అలాగే ఒప్పో A6s 5G, A6x 5G సిరీస్ ఫోన్ల ధరలు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. మరోవైపు వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. నోర్డ్ CE 6 లైట్ 8GB+256GB వేరియంట్ ధర రూ.34,999కి చేరింది.
పరిశ్రమ నిపుణుల ప్రకారం, గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా సమస్యలు, పెరిగిన కాంపోనెంట్ ఖర్చులు స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే పండగ సీజన్ వరకు స్మార్ట్‌ఫోన్ ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!