
జనరల్

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ‘రోజానా సిప్’ పేరుతో కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లో రోజుకు కేవలం రూ.10 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ప్రారంభంలో కనీసం రెండు పథకాలను ఎంచుకోవాల్సి ఉండగా, తర్వాత వాటి సంఖ్యను 10 వరకు పెంచుకునే అవకాశం ఉంది.
మల్టీక్యాప్, స్మాల్ క్యాప్, వేల్యూ వంటి పథకాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. పరిమిత పొదుపు, పెట్టుబడులపై అవగాహన లేమి, మార్కెట్ హెచ్చుతగ్గులపై భయం వంటి సమస్యలను ఎదుర్కొనే కొత్త ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను మరింత మందికి చేరువ చేయడమే ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!