

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఐస్‌క్రీమ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆర్‌ఐఎల్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) ‘బాంబే క్రీమరీ’ పేరుతో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మంగళవారం ప్రకటించింది. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ రూపాల్లో లభించే ఈ ఐస్‌క్రీమ్‌ల ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుంది. తొలుత పశ్చిమ భారత మార్కెట్లో విడుదల చేసి, అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆర్‌సీపీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోహాట్‌స్టార్ తన స్ట్రీమింగ్ సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, సింగపూర్‌లలో సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల వినియోగదారులకు 12కు పైగా భాషల్లో 1.60 లక్షలకు పైగా గంటల కంటెంట్ అందుబాటులోకి రానుంది. దీంతో జియోహాట్‌స్టార్ అంతర్జాతీయ వినోద మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!