
క్రీడలు

ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన చేవూరు భవిష్ రెడ్డి సత్తా చాటాడు. బెల్జియంలోని ఆస్టెండ్‌లో జరిగిన ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మినియమ్ బాలుర ఇన్‌లైన్ స్కేటింగ్ విభాగంలో ఆరు కేటగిరీల్లో పోటీపడ్డాడు. 1200 మీటర్ల విభాగంలో రెండు స్వర్ణాలు, 600 మీటర్లలో ఒక స్వర్ణం, ఒక రజతం, 1000 మీటర్లలో స్వర్ణం, 800 మీటర్లలో రజతం సాధించాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో భవిష్ మొత్తం 8 పాయింట్లు సాధించి మినియమ్ బాలుర విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన శాట్ చైర్మన్ శివసేనారెడ్డి భవిష్‌ను అభినందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!