

ఈరోజు ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,840, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,690గా ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,080, ఢిల్లీలో రూ.1,45,070, అహ్మదాబాద్‌లో రూ.1,44,970, ముంబై, కోల్‌కతాల్లో రూ.1,44,920గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: బంగారం ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!