

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించడంతో అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే లేదా నిర్మించాలనుకునే వారికి తక్కువ వడ్డీతో రుణాలు అందుబాటులోకి వచ్చాయి. దీర్ఘకాలిక రుణాల్లో స్వల్ప వడ్డీ తగ్గుదల కూడా భారీ మొత్తంలో ఆదా కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోం లోన్లు 7.15 శాతం వడ్డీతో ప్రారంభమవుతున్నాయి. ₹20 లక్షల రుణాన్ని 10 సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటే నెలకు సుమారు ₹23,377 EMI చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం వడ్డీ భారం సుమారు ₹8.05 లక్షలు ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్‌లో 7.25 శాతం వడ్డీతో EMI ₹23,480గా ఉండగా, టాటా క్యాపిటల్‌లో 7.50 శాతం వడ్డీతో EMI ₹23,740గా ఉంటుంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 7.75 శాతం వడ్డీతో నెలవారీ EMI ₹24,002గా ఉంటుంది. రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, టెన్యూర్, అర్హత ప్రమాణాలను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!