

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. గతంలో నిలిపివేసిన ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ విధానాన్ని ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలతో పునరుద్ధరించనున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌కు ఇంట్రాడే బారోయింగ్ నిబంధనల్లో సడలింపులు, ఇన్వెస్టర్ మరణిస్తే సెక్యూరిటీల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
కొత్త బైబ్యాక్ నిబంధనల ప్రకారం, కంపెనీలు 66 పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. కేటాయించిన నిధుల్లో కనీసం 40 శాతం మొదటి సగంలోనే వినియోగించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వారసత్వ బదిలీ ప్రక్రియల్లో అనేక సడలింపులు ఇచ్చారు. డాక్యుమెంటేషన్ తగ్గించడం, క్లెయిమ్ పరిమితులు పెంచడం వంటి చర్యలతో పెట్టుబడిదారులకు మరింత సులభతరం చేయాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!