

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ‘గపూర్’ వెబ్ సిరీస్‌లో ఒక ప్రత్యేక గీతంలో కనిపించనున్న ఆమె, ‘రేంజర్’, ‘వ్యన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘రాగిణి-3’ వంటి ప్రాజెక్ట్‌లతో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోయే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిజీ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, ఒక ప్రాజెక్ట్ షూటింగ్ ముగిసిన వెంటనే మరో ప్రాజెక్ట్ షూటింగ్‌కు వెళ్లేదాన్నని, రోజుకు కేవలం ఆరు గంటల నిద్ర మాత్రమే దక్కేదని తెలిపారు.
డ్యాన్స్ రిహార్సల్స్‌కి కూడా సమయం దొరకని స్థాయిలో పని ఒత్తిడి ఉండేదని చెప్పిన ఆమె, ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్ మధ్య తేడాలు చూపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. గతంలో రెండింటినీ సమానంగా మెప్పించిన నటీనటులు ఉన్నారని గుర్తుచేశారు. తాత్కాలిక విజయాల కంటే శాశ్వతంగా గుర్తుండే పాత్రలే తన లక్ష్యమని, కెరీర్ ప్రారంభంలో నేర్చుకున్న అనుభవాలే ఇప్పటికీ తనకు సహాయపడుతున్నాయని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!