
బిజినెస్

రాష్ట్రవ్యాప్తంగా 684 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.808 కోట్లు ఖర్చు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు, చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ ఆలయాల పునరుద్ధరణను రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,000 శ్రీవాణి ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న ఆలయాల పునరుద్ధరణ, మరమ్మతు పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!