
క్రీడలు

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈ)లకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడలోని పీఆర్ ఈఎన్‌సీ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
శాఖలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా లేదా నేరుగా భర్తీ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే 2014–19 మధ్య చేపట్టిన ఉపాధి హామీ పథకం సిమెంట్ రోడ్ల పనులకు సంబంధించి గత ప్రభుత్వం నమోదు చేసిన ఏసీబీ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!